- Advertisement -

వైసీపీ నేతలపై ఆగని దాడులు, మరో నేతపై దాడి

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి వైసీపీ నేతలపై దాడులు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు ఏదో చోటు వైసీపీ నేతలు, వారి ఇళ్లు, ఆస్తులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు తెలుగు తమ్ముళ్లు.

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులపైనే కేసులు నమోదు చేస్తుండటంతో ప్రజల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక తాజాగా అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేతపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.

తంబళ్లపల్లి నియోజకవర్గం పులికల్లు గ్రామ పంచాయతీకి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు లక్ష్మీ నారాయణ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దీంతో లక్ష్మీనారాయణను వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణను పరామర్శించారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి. దాడుల సంస్కృతి మంచిది కాదని ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -