ఇవాళ ఉదయం కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్దైన సంగతి తెలిసిందే. ఎడతెరపిలేకుండా 2 గంటల పాటు వర్షం కురియడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. స్కూళ్లకు సెలవు ఇవ్వగా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఇచ్చారు.
ఇక ఇప్పుడు ఏపీ వంతు వచ్చేసింది. హైదరాబాద్ మాదిరిగానే ఏపీకి భారీ వర్ష సూచన ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్‌తో ఏపీలోని పలు ప్రాంతాల్లో వాన దంచి కొట్టడం ఖాయమని అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం ఉత్తర తమిళనాడు మరియు దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మీదుగా సగటున సముద్ర మట్టానికి 1.5 కి.మీ.ఉంది.
దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది వాతావరణ వాఖ. పలుచోట్ల ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షం పడటమే కాదు గంటకు 30-40 కిలోమీటర్ల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.