Sunday, May 4, 2025
- Advertisement -

టార్గెట్ పదేళ్లు..టీపీసీసీ లక్ష్యం అదేనా!

- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీనియర్ నాయకులను కలుస్తు వారి అభిప్రాయాలను తీసుకుంటున్న మహేశ్ ఇవాళ్టి నుండి జిల్లాల వారీగా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు.

గాంధీభవన్‌ వేదికగా ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉమ్మడి వరంగల్, కరీంనగర్‌, నిజామాబాద్ జిల్లాల పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్‌ మున్షీ, ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

ఆయా జిల్లాల ఇంఛార్జి మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, మంత్రులు, జిల్లా ఇంఛార్జి మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అభ్యర్థులు పీసీసీ ఆఫీస్ బేరర్లు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే కార్పొరేషన్ ఛైర్మన్​లు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పాల్గొంటారు. తొలుత వరంగల్ జిల్లా, ఆ తర్వాత కరీంనగర్, నిజామాబాద్ జిల్లా నేతలతో సమీక్షా సమావేశాలు ఉండనున్నాయి.

ఆ తర్వాత మిగితా జిల్లాల నాయకులతో సమావేశాలు నిర్వహించనున్నారు మహేశ్ కుమార్. సమావేశాల్లో నేతల అభిప్రాయాలను తీసుకుని ఆ తర్వాత కమిటీల ఏర్పాటు, పార్టీ కోసం మొదటి నుండి కష్టపడిన వారికి ఎలాంటి ప్రాధాన్యత కల్పించాలన్న దానిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పదేళ్లు అధికారం తమదేనని బహిరంగంగానే చెప్పిన నేపథ్యంలో పీసీసీ చీఫ్ సైతం తన మార్క్‌ను స్పష్టంగా చూపించేందుకు రెడీ అవుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -