Sunday, May 4, 2025
- Advertisement -

చంద్రబాబా మజాకా..కొవ్వొత్తులకే రూ.23 కోట్లా?

- Advertisement -

ఏపీని బుడమేరు వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇక వరద సాయం పేరుతో చంద్రబాబు చేసిన ఖర్చు వివరాలను బయటపెట్టింది వైఈపీ. వందల కోట్ల భారీ కుంభకోణానికి తెరలేపిందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికీ వరదసాయం అందకపోవడంతో విజయవాడలోని కలెక్టరేట్‌ చుట్టూ నిత్యం వేలాది మంది బాధితులు తిరుగుతున్నారని తెలిపారు.

విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.534 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడికాగా వరదల పేరు చెప్పి వందల కోట్లు కొట్టేస్తారా? అని వైసీపీ నేతలే కాదు ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఆహార సరఫరాకు రూ.368.18 కోట్లు, మంచి నీటి ప్యాకెట్లకు రూ.26.8కోట్లు, వైద్య సహాయానికి రూ.2.8 కోట్లు, నిత్యవసర వస్తువులకు రూ.61.28కోట్లు, కొవ్వొత్తులకు రూ.23.07కోట్లు ఖర్చు చేసినట్లు టీడీపీ లెక్కలు చెబుతున్నారని మండిపడింది. ఇక ఇందులో హైలైట్ ఏంటంటే కొవ్వొత్తులకే రూ.23 కోట్లు ఖర్చు చేయడం విశేషం.
ఇక వరద సాయానికి 412 డ్రోన్లు వినియోగించామని కూటమి నేతలు చెబుతోండగా అసలు విజయవాడలో 412 డ్రోన్లు ఉన్నాయా? అని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -