ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయి. భౌతికంగా దాడి చేయడమే కాదు ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్నారు కూటమి నేతలు. టీడీపీ నేతల దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి వైసీపీ నేతలపైనే కేసులు పెట్టే పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చింది ఆ పార్టీ లీగల్ సెల్. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తల్లారా.. ఒక్క కాల్ చేయండి చాలు..ఏ పోలీస్ మిమ్మల్ని టచ్ చేసినా మాకు సమాచారం ఇవ్వండి.. ఆ పోలీస్ తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తాం..ఇది వైసీపీ ఇస్తున్న హామీ అని వైసీపీ లీగల్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఇందుకు కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయగా సభ్యుల వివరాలతో పాటు వారి ఫోన్ నెంబర్లను సైతం ఇచ్చింది వైసీపీ. సెంట్రల్ ఆఫీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సభ్యుల వివరాలు… జె. సుదర్శన్ రెడ్డి (సీనియర్ అడ్వకేట్) – 9440284455, కొమ్మూరి కనకారావు (మాజీ ఛైర్మన్, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్) – 9963425526, దొడ్డా అంజిరెడ్డి (రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ అర్గనైజింగ్ ప్రెసిడెంట్) – 9912205535 ఉన్నారు.
కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే అణిచివేస్తాం.. కేసులు పెడతామంటే ఎలా? అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఇవాళ 100 మందిని మీరు అరెస్ట్ చేయవచ్చు.. కానీ రేపు ఆ 100 మంది 2 లక్షల మంది అవుతారు.. అప్పుడు జైళ్లు సరిపోతాయా? చెప్పాలన్నారు. యస్‌ఆర్‌సీపీలోని ప్రతి కార్యకర్త ఒక సోషల్ మీడియా సైనికుడు అవుతాడు అని తేల్చిచెప్పారు.