విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అద్భుతమైన హ్యాట్రిక్ కొలాబరేషన్ తర్వాత మోస్ట్ ఎవైటెడ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ చాలా క్యురియాసిటీని క్రియేట్ చేస్తోంది. ఈ డైనమిక్ కాంబినేషన్ ఇప్పటికే రెండు పెద్ద హిట్లను అందించింది. బ్లాక్బస్టర్లను అందించడంలో అనిల్ రావిపూడి ది స్పెషల్ రికార్డ్. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని స్పెషల్ పోస్టర్‌తో ప్రకటించారు మేకర్స్. సంక్రాంతి రోజు జనవరి 14 న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే సంక్రాంఇ రేసులో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10 న రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించగా బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా డాకు మహారాజ్ సినిమా జనవరి 12న రిలీజ్ కానుందని ప్రకటించారు.
