Saturday, May 3, 2025
- Advertisement -

సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ..!

- Advertisement -

కాకినాడ పోర్టులో అక్రమ బియ్యం నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

అలాగే ఇటీవల పవన్ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. పలువురు కేంద్రమంత్రులను కలిశారు. తన ఢిల్లీ పర్యటన వివరాలతో పాటు నామినేటెడ్ పదవులపై చర్చించినట్లు సమాచారం.

రాజ్యసభ ఉప ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ సోదరుడు నాగబాబుకు రాజ్యసభ సీటు ఇవ్వాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు దీనిని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.

ఇక మూడు స్థానాల్లో ఒకటి బీజేపీ కోటాలో ఆర్ క్రిష్ణయ్యకు ఇచ్చే ఛాన్స్ ఉండగా టీడీపీ కోటాలో బీద మస్తాన్ రావ్ మరల ఎన్నికయ్యే అవకాశం ఉంది. మోపిదేవి వెంకటరమణ స్థానంలో టీడీ జనార్దన్, వర్ల రామయ్య, భాష్యం రామక్రిష్ణ, సానా సతీశ్, కంభంపాటి రామ్మోహన్ తో పాటు పలువరి పేర్లు వినిపిస్తుండగా ఎవరికి అవకాశం దక్కుతుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -