- Advertisement -
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ధోని తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా ఉన్న ధోని… ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో పర్యటిస్తున్నాడు.
ఈ సందర్భంగా స్థానికులతో కలిసి ధోని, సాక్షిలు ప్రముఖ జానపద గీతం ‘గులాబి షరారా’కు ఆనందంగా డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
టీమిండియా కెప్టెన్‌గా భారత జట్టుకు మూడు ఐసీసీ టైటిళ్లు (2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ) అందించాడు ధోని. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.