ఎవరూ ఊహించని విధంగా నటుడు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నెల నాలుగో తేదీన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తప్పిస్తున్నట్లు ఒక మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు కాగా ఇవాళ చిక్కడపల్లి పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు.
అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 105 సెక్షన్ నాన్‌బెయిలబుట్ కేసు కాగా 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. వైద్య పరీక్షల నిమిత్తం బన్నీని ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ట్ స్టేషన్‌కు తీసుకెళ్లనున్నారు.గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు. ఈ ఘటనలో బన్నీ రూ.25 లక్షల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై లంచ్ మోషన్ విచారణ జరపాలని జస్టిస్ జువ్వాడి శ్రీదేవి కోర్టులో మెన్షన్ చేశారు న్యాయవాదులు నిరంజన్ రెడ్డి అశోక్ రెడ్డి. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆర్దర్స్ ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. మరోవైపు ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న చిరంజీవి దానిని రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు.
తన అరెస్ట్ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు బన్నీ. తన భార్య స్నేహకు ధైర్యం చెప్పారు. భయపడకు.. నాకు ఏమీ కాదు. అరెస్ట్‌కు ముందు తన భార్య స్నేహతో మాట్లాడారు అల్లు అర్జున్. చివరిలో తన భార్యకు ముద్దు ఇచ్చి పోలీసు వాహనం ఎక్కారు.
బన్నీ అరెస్ట్‌ను ఖండించారు కేఏపాల్, లక్ష్మీ పార్వతి. చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్ళినపుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో ముగ్గురు, పుష్కరాల్లో 23 మంది చనిపోయారు మరి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారా? రాజకీయ నాయకులకు ఒక న్యాయం.. నటులకు, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా? చెప్పాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒకరు చనిపోవడంతో పోలీసులు చర్య తీసుకున్నారని ఇందులో తన జోక్యం ఉండదని స్పష్టం చేశారు.