వైఎస్ఆర్సీపీ జెండా మోసిన ప్రతి ఒక్కరికీ జగన్ భరోసా ఇస్తాడున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లా ముఖ్యనేతల సమావేశంలో మాట్లాడిన జగన్.. కార్యకర్తలను ఇంతవరకు ఒక మాదిరిగా చూశాం కానీ ఇక నుండి కార్యకర్తలను గొప్పగా చూసుకోవాలన్నారు.
మనం యుద్ధం చేసేది చంద్రబాబుతో కాదు.. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి చెడిపోయిన సామ్రాజ్యంతో యుద్ధం చేస్తున్నామని చెప్పారు జగన్. ఆ మీడియా సామ్రాజాన్ని ఎదుర్కోవడానికి మనకి ఉన్న ఏకైక అస్త్రం సోషల్ మీడియా అన్నారు జగన్.
తాను జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు నేను మీరు కలిసి ఎలా చేద్దాం అనేది మాట్లాడుదాం అని తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీ జెండా మోసే ప్రతి కార్యకర్తకీ.. ఇదే మీ జగన్ భరోసా..ఇంతకు ముందులా కాదు.. ఇకపై గొప్పగా చూసుకునే బాధ్యత తీసుకుంటాం.. ఇది నా భరోసా అని స్పష్టం చేశారు జగన్. సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వం అక్రమాల్ని గ్రామస్థాయి నుంచే ప్రశ్నిస్తూ.. నిలదీయండి అన్నారు.
జగన్ అధికారంలో ఉండి ఉంటే.. ఈ 7 నెలల్లో ఏ ఏ పథకాలు వచ్చేయో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోందన్నారు. ఈ సంక్రాంతికి అన్నదాతలకి రైతు భరోసా, చిరు వ్యాపారులకి జగనన్న తోడు, అక్క చెల్లెమ్మలకి ఆసరా వచ్చి ఉండేది… చంద్రబాబు చెప్పిన వాగ్దానాలు, ఇచ్చిన హామీలన్నీ గాలికి ఎగిరిపోయాయి అన్నారు జగన్.