- Advertisement -

విజయసాయిరెడ్డిపై బండ్ల షాకింగ్ కామెంట్స్

- Advertisement -

రాజకీయాల నుండి తప్పుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసి విజయ సాయిరెడ్డి సంచలనం సృష్టించారు. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన విజయ సాయిరెడ్డి.. చంద్రబాబుతో విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉంటుంది అంటూ ట్వీట్ చేశారు.

విజయసాయిరెడ్డి నిర్ణయంపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అనుభవించి కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం రాజకీయ నేతలకు ఫ్యాషన్ అయిపోయిందని కామెంట్ చేశారు. ఇది ధర్మమా అంటూ సోషల్ మీడియాలో బండ్ల గణేష్ పోస్ట్ చేశారు.

వైఎస్ జగన్ సీఎం కావాలని, పార్టీ కోసం పని చేసిన వ్యక్తి విజయసాయిరెడ్డి అన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. వైసీపీతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది.. ఎంతో మంది కుట్రలు చేసినా ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి విజయసాయిరెడ్డి అన్నారు.

కేసులకు భయపడే వ్యక్తి విజయసాయిరెడ్డి కాదు అన్నారు మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ వేమారెడ్డి. ఆయన ఏ పార్టీలోనూ చేరనని స్పష్టంగా చెప్పారు… వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు విజయసాయిరెడ్డి క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -