Sunday, May 4, 2025
- Advertisement -

జగన్‌కు నమ్మకద్రోహం చేయను!

- Advertisement -

ఎలాంటి పరిస్థితుల్లో జగన్‌కు నమ్మక ద్రోహం చేయనని తెలిపారు విజయసాయి రెడ్డి. రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయి.. లండన్ లో ఉన్న జగన్ తో అన్ని అంశాలు మాట్లాడాకే నా రాజీనామాను అందించా..రాజకీయాలనుంచి తప్పుకున్నా, ఇక రాజకీయాల గురించి మాట్లాడను అన్నారు. తాను ఏరోజు అబద్దాలు చెప్పలేదు.. నాలుగు దశాబ్దాలుగా జగన్ తో, ఆయన కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అన్నారు.

నాలాంటి వాళ్లు ఇంకో వెయ్యి మంది వైసీపీని వీడినా జగన్ కు ఉన్న ప్రజాదరణ ఏమాత్రం తగ్గదు అన్నారు . రాజీనామా మాత్రమే కాదు రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నాను అన్నారు. జగన్ మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు.. నాలాంటి వాళ్లు వెయ్యి మంది పార్టీని వీడినా కూడా ఆయనకు ఉన్న ప్రజాదరణ తగ్గదు అన్నారు.

అప్రూవర్ గా మారాలని ఎన్నో ఒత్తిడులు వచ్చిన నేను తలవంచలేదు, అలాంటి పరిస్థితులే ఇప్పుడు ఎదురైయ్యాయి…అయిన నేను జగన్ కు నమ్మకద్రోహం చేయను అన్నారు.కూటమి ప్రభుత్వం వచ్చాక నాపై కేసు నమోదు చేశారు. లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారు.విక్రాంత్ రెడ్డి ని నేను పంపించలేదు, కాకినాడ సీ పోర్ట్ వ్యవహారంలో నా ప్రమేయం లేదు అన్నారు.

విక్రాంత్ రెడ్డి ని కేవీ రావు కు నేను పరిచయం చేయలేదు.. నాకు వ్యాపారాలు లేవు, దేనిలో నేను భాగస్వామిని కాదు అన్నారు. వ్యాపార లావాదేవీలు నాతో నా వియ్యంకుడు ఎప్పుడు చర్చించరు, వారి వ్యాపారాల గురించి నాకు తెలియదు.రాజకీయాల నుంచి నేను తప్పుకుంటే నేను బలహీనుడిగా మారుతాను, నన్ను ఎందుకు కేసుల నుంచి తప్పిస్తారు? అన్నారు. గవర్నర్ పదవి కానీ, బీజేపీ నుంచి ఎంపీ పదవి కానీ నేను ఎవరిదగ్గర హామీ తీసుకోలేదు అని తేల్చిచెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -