- Advertisement -

వైసీపీకి రాజీనామా..అవన్నీ పుకార్లే!

- Advertisement -

రాజకీయాల నుండి వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొంతమంది రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డిసైతం రాజీనామా చేస్తున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోండగా దీనిపై స్పందించారు అయోధ్య రామిరెడ్డి.

రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అయోధ్య రామిరెడ్డి వైసీపీ తరపున 2020లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం వచ్చే ఏడాది వరకు ఉంది.

గత కొద్దిరోజులుగా ఆయన విదేశాల్లో ఉండగా ఇవాళ ఏపీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తన రాజీనామాపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు విజయసాయి. వైసీపీ తరపున 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉండగా ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో నలుగురు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య రాజీనామా చేయగా కృష్ణయ్య బీజేపీలోకి మిగితా ఇద్దరు టీడీపీలోకి వెళ్లారు. ప్రస్తుతం వైసీపీకి రాజ్యసభలో ఏడుగురు సభ్యులు ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -