147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రను తిరగరాశాడు ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా. శ్రీలంక గడ్డపై టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన ఆస్ట్రేలియా ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంత వరకు ఏ ఆసీస్ బ్యాటర్ కూడా శ్రీలంక గడ్డ పై డబుల్ సెంచరీ చేయలేదు.
తాజాగా ఆలోటును తీర్చేశాడు ఖవాజా. 290 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో డబుల్ సెంచరీ చేయగా ఖవాజా కెరీర్‌లో ఇది తొలి డబుల్ సెంచరీ కూడా. ఇప్పటి వరకు శ్రీలంక గడ్డపై అత్యధిక పరుగులు చేసిన రికార్డు జస్టిన్ లాంగర్ పేరిట ఉండేది. 2004లో కొలంలో వేదికగా జరిగిన మ్యాచ్‌లో లాంగర్ 295 బంతుల్లో 166 పరుగులు సాధించాడు.
తాజాగా ఆ రికార్డును చెరిపేశాడు ఖవాజా. 352 బంతులు 232 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 140 ఓవర్లు పూర్తి అయ్యే సరికి 5 వికెట్ల నష్టానికి 589 పరుగుల భారీ స్కోరు చేసింది . స్టీవ్ స్మిత్ (141), జోస్ ఇంగ్లిష్ (102) సెంచరీలతో చెలరేగారు.