రాయలసీమ ఎత్తిపోతలను శాశ్వతంగా సమాధికట్టేలా ఉంది చంద్రబాబు తీరు అని మండిపడ్డారు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన కాకాణి..సీమకు మేలు చేసేలా ఒక్క నిర్ణయమూ చంద్రబాబు తీసుకోలేదన్నారు.
తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం ప్రాజెక్టులో నీరు 798 అడుగులకు చేరిన వెంటనే తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. 800 అడుగులకు రాగానే నీటి వాడకానికి వినియోగిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం దీనిపై అడ్డు చెప్పలేదు అన్నారు.
ఇది ఇప్పుడు వాళ్ల హక్కుగా మారిపోయింది. 880 కనిష్ట స్థాయికి చేరితే కానీ ఆంధ్రరాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు నీళ్లు అందవు. దీనిపై పోరాడటంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఓటుకు నోటులో ఇరుక్కున్న చంద్రబాబు అప్పటి తెలంగాణ ప్రభుత్వానికి సాగిలపడి…నీటి హక్కులన్నీ వదులుకున్నాడన్నారు.
స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలూ తాకట్టు పెట్టడం చంద్రబాబుకు ఆనవాయితీ.. గుక్కెడు నీళ్లు అందించలేని పరిస్థితి తెచ్చి సీమరైతులకు కన్నీళ్లు తెప్పించాడు అని మండిపడ్డారు.

