Saturday, May 3, 2025
- Advertisement -

బెట్టింగ్ యాప్స్‌…మాజీ మంత్రి ఫామ్‌హౌస్‌ అడ్డగా?

- Advertisement -

తెలంగాణకు చెందిన ఒక మాజీ మంత్రి ఫార్మ్ హౌస్ కేంద్రంగా భారీగా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ దందా జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి భారీ మొత్తంలో చైనా నుండి ముడుపులు అందినట్టు సమాచారం. అతని ఫార్మ్ హౌస్ కేంద్రంగానే ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ లావాదేవీలు ? జరిగాయని తెలుస్తోంది.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయోన్సర్లకు చెల్లించిన డబ్బులకు మొత్తం మధ్యవర్తిత్వం వహించింది మాజీ మంత్రి అనుచర వర్గం. శంకరపల్లి,ఇబ్రహీంపట్నం, శంషాబాద్,మేడ్చల్ ఫార్మ్ హౌస్ కేంద్రంగా ఈ దందా నడిపారు అని సమాచారం…

ఈడీకి చేరింది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం. 11 మంది ప్రమోటర్స్ వివరాలు సేకరించింది ఈడీ. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన యూట్యూబర్ల వ్యవహారంపై ఈడీ ఆరా తీస్తుండగా పోలీసులు సేకరించిన వివరాలు తెప్పించుకున్నారు ఈడీ అధికారులు.

అలాగే 11 మంది యూట్యూబర్ల సంపాదనపై ఈడీ ఆరా తీయగా మాజీ మంత్రి అండతో హైదరాబాద్ కేంద్రంగా సంవత్సరానికి 1200 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -