Tuesday, May 6, 2025
- Advertisement -

ఏపీలో అకాల వర్షాలు!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా రాబోయే రోజులలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.

ఏప్రిల్ 3న రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 4న ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షపాతం కొనసాగనుందని తెలిపారు. తుఫానులు, ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, కూలీలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ఏప్రిల్ 1న నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలో అత్యధికంగా 40.3°C నమోదు అయ్యింది. ప్రజలు తగినంత నీరు తాగి, డీహైడ్రేషన్ కు గురికాకుండా చూసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే రైతులు తమ పంటలను రాబోయే వర్షాల ప్రభావం నుంచి రక్షించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలి అని సూచించారు.

అకాల వర్షాలతో రాయలసీమ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 2-3°C తగ్గి, కొన్ని ప్రాంతాల్లో వేడి తగ్గే అవకాశం ఉందని.. విశాఖపట్నంలో తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ అధిక తేమ (హ్యూమిడిటీ) ఉండే అవకాశం ఉందని వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -