తెలుగుదేశంకు ప్రైవేటు ఏజెన్సీగా పోలీసులు పనిచేస్తున్నారు అని మండిపడ్డారు మాజీ మంత్ఇర గుడివాడ అమర్‌నాథ్. వైసీపీ కార్పొరేటర్లను పోలీసులే బెదిరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం అని చెప్పారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని 19న విశాఖ మేయర్‌పై అవిశ్వాసంలో గెలవాలని కుట్రలు చేస్తోందన్నారు. పోలీస్ అధికారులు పచ్చచొక్కాలు వేసుకున్నట్లుగా రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాలను అతిక్రమించి పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ కార్పోరేటర్లను పోలీసులు బెదిరిస్తున్నారని… నిన్న ఒక కార్పోరేటర్ ఇంటికి రాత్రి సమయంలో పోలీసులను పంపి, వారి కుటుంబసభ్యులను బెదిరించారు. ఖాకీ దుస్తులు తీసేసి, పచ్చచొక్కాలతో తెలుగుదేశం పార్టీకి సెక్యూరిటీ ఏజెన్సీగా పనిచేస్తున్నారా? దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం అని స్పష్టం చేశారు. పోలీసులు అంబేద్కర్ రాజ్యాంగం పరిధిలో పనిచేస్తారా? లేక లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం కోసం పనిచేస్తున్నారా? చెప్పాలన్నారు.