Saturday, May 3, 2025
- Advertisement -

డేటింగ్‌లో అనుపమ-ధృవ్ విక్రమ్!

- Advertisement -

మరో సినీ జంట ప్రేమలో ఉందా…?త్వరలో ఆ హీరో- హీరోయిన్ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. అనతికాలంలోనే తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనుపమ.

రీసెంట్‌గా ‘టిల్లు స్క్వేర్’ , ‘డ్రాగన్’ సినిమాలతో వరుస హిట్స్ సాధించింది అనుపమ. అంతేగాదు ఆమె నటించిన ‘పరాడా’ రిలీజ్‌కు రెడీగా ఉంది. అలాగే ధృవ్ విక్రమ్‌తో బైసన్ సినిమాలో నటిస్తోంది. ఈ క్రమంలో అనుపమ – ధృవ్‌ డేటింగ్‌లో ఉన్నారన్న వార్త సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది.

దీనికి కారణం వీరిద్దరూ ఒకే Spotify ప్లేలిస్ట్‌ను షేర్ చేసుకోవడం, అందులో ఒకరినొకరు ముద్దుపెట్టుకుంటున్న ఫోటో ఉండటం అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.
ఈ ప్లేలిస్ట్‌ను ప్రైవేట్ చేయకముందే ఆ ఫోటో వైరల్‌గా మారింది. మరి వీరిద్దరూ నిజంగానే డేటింగ్‌లో ఉన్నారా లేక సినిమా ప్రమోషన్‌ కోసమా అన్నది తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -