Saturday, May 3, 2025
- Advertisement -

ధర్మం వధ..సత్యం చెర!

- Advertisement -

ఒక్క అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏమైనా చేయవచ్చని నిరూపిస్తున్నారు కూటమి నేతలు. ప్రతిపక్ష వైసీపీ చెందిన ప్రజాప్రతినిధులను బెదిరింపులు, మాట వినని వారిపై కేసులు ఇలా ఏదో రకంగా వైసీపీ చేతిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దక్కించుకుంటున్నారు.

ఇప్పటివరకు ఇలా పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను దక్కించుకోగా మరికొన్ని చోట్ల చుక్కుదురవుతోంది. అయితే తాజాగా జీవీఎంసీ(గ్రేటర్ విశాఖ కార్పొరేషన్‌)ను ఇలానే దక్కించుకుంది కూటమి పార్టీ.

ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ… మేయ‌ర్ పీఠం కోసం చంద్ర‌బాబు యాద‌వ మ‌హిళ‌కు ద్రోహం చేశారు చంద్రబాబు. కూటమి పాలనలో ధర్మం వధ, సత్యం చెరలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి కన్నబాబు. ఓ యాదవ మహిళకు వైయ‌స్‌ జగన్‌ మేయర్‌ పదవి ఇస్తే దానిని కుట్రలు, కుతంత్రాలతో కూటమి సర్కార్‌ దక్కించుకుందని మండిపడ్డారు.

కూటమి చావు బతుకుల మీద మ్యాజిక్ ఫిగర్ చేరుకుందని… చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గెలిచారు అని దుయ్యబట్టారు కన్నబాబు. కూటమిని తట్టుకొని నిలబడ్డ వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నాము అన్నారు. బలం లేకుండా అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు..ధర్మం న్యాయం గురించి మాట్లాడే హక్కు కూటమి నాయకులకు లేదు అన్నారు అమర్‌నాథ్. మేయర్ మీద అవిశ్వాసం గెలిచారు… విశాఖ ప్రజల మనసుల్లో విశ్వాసం కోల్పోయారు అని చురకలు అంటించారు. కూటమి నిజంగా గెలిచే పరిస్థితి ఉంటే నెల రోజుల సమయం ఎందుకు తీసుకున్నారు..జీవీఎంసీ డబ్బులతో ప్రత్యేక విమానాలు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల కోసం తీసుకువెళ్లారు..యాదవ్ కుల ద్రోహులు కూటమిలో ఉన్నారు అని దుయ్యబట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -