Saturday, May 3, 2025
- Advertisement -

సమంత విడాకులకు కారణం ఇదేనా?

- Advertisement -

టాలీవుడ్ స్టార్ సమంత మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను లైక్ చేయడం సంచలనంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే సమంత, ఆరోగ్య సమస్యల సమయంలో కొంతమంది భర్తలు… భార్యలను వదిలిపెట్టి వెళ్లిపోతారని సున్నితమైన సామాజిక అంశాన్ని సూచించే ఓ పోస్ట్‌కి స్పందించి వార్తల్లో నిలిచారు.

Success Verse అనే ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసిన ఈ పోస్ట్ సమంత వార్తల్లో నిలవడానికి కారణమైంది. మహిళలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు, ప్రతి 1,000 మంది పురుషుల్లో సుమారు 624 మంది తమ భార్యలను వదిలిపెట్టి వెళ్లిపోతారని పేర్కొన్నారు. అదే సమయంలో, భర్తలు అనారోగ్యం పాలైతే, ఎక్కువ మంది మహిళలు సంబంధాన్ని కొనసాగిస్తూ వారిని మద్దతుగా నిలుస్తారని తెలిపింది. భావోద్వేగ మరియు శారీరక దూరం కారణాలుగా పేర్కొన్నారు.

సమంత ఈ పోస్ట్‌ను లైక్ చేయడంతో అది వేగంగా వైరల్ అయింది. ఎందుకంటే ఇది ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధం ఉందని పలువురు భావించారు. 2021లో నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నారు సమంత. ఆ తర్వాత ఆమెకు మయోసైటిస్ అనే ఆటోఇమ్యూన్ వ్యాధి నిర్ధారణ కాగా సినిమాలకు దూరం అయ్యారు. ఈ నేపథ్యంలో సమంత లైక్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారగా ఈ పోస్ట్‌కు ఇప్పటికే 60,000కుపైగా లైక్స్ వచ్చాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -