Friday, May 2, 2025
- Advertisement -

ఆ యంగ్ హీరో కష్టాలు అన్ని ఇన్ని కావు!

- Advertisement -

తెలుగు సినిమాలన్ని పాన్ ఇండియా మూవీలుగా వస్తున్న నేపథ్యంలో నిర్మాతలకు లాభాల సంగతి పక్కన పెడితే పెట్టిన డబ్బులు తిరిగి వస్తే చాలు అనే పరిస్థితి నెలకొంది. విడుదలయ్యే సినిమాల్లో 10 శాతం సినిమాలు మాత్రమే లాభాల్లో నిలుస్తుండగా 90శాతం బొక్క బొర్లా పడుతున్నాయి. దీంతో నిర్మాతలు భారీ నష్టాలను చవి చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఒక యువ హీరో ప్రతి సినిమా కోసం ₹8 నుండి ₹9 కోట్ల వరకు రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నట్లు సమాచారం. అయితే అంతకముందు వరకు ₹10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే ఆ నటుడు వరుస ఫ్లాప్‌లతో రెమ్యూనరేషన్ తగ్గించుకున్నాడు.

అయితే తాజాగా ఆ రెమ్యూనరేషన్‌ను మరింత తగ్గించాల్సిన పరిస్థితి నెలకొందట. ఎందుకంటే ఇప్పటికే ఆయనకు సంబంధించిన మూడు ప్రాజెక్టులు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయాయి. పెట్టిన పెట్టుబడులను ఎలా తిరిగి పొందాలో స్పష్టత లేక గందరగోళంలో ఉన్నారు. ఈ చిత్రాలకు సంబంధించిన నాన్ థియేట్రికల్ డీల్స్ ఇంకా పూర్తవలేదు. అందులో రెండు సినిమాలు పూర్తయ్యాయి. మరొకటి షూటింగ్ కూడా మొదలవలేదు.

పూర్తయిన రెండు చిత్రాల టీవీ హక్కులు ఇంకా అమ్ముడుపోలేదు. ఈ సినిమాల్లో ఒకటి ₹40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా దానికి థియేట్రికల్ వ్యాల్యూ కేవలం ₹15 కోట్లు మాత్రమే ఉంది. ఆ ₹15 కోట్లకూ కొనుగోలుదారులు దొరకడం లేదు. ఇంకొక సినిమా ₹25–30 కోట్ల మధ్య బడ్జెట్‌తో తెరకెక్కింది. దాని నిర్మాత దాన్ని ఓ పెద్ద హీరో సినిమా సరసన ప్యాకేజ్‌గా అమ్మాలనే ప్రయత్నం చేస్తున్నారు.

మూడవ సినిమా చాలా కాలంగా వాయిదా పడుతోంది. ఆ నిర్మాత తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కూడా తన వద్ద ఉన్న ఒక పెద్ద సినిమా ద్వారా ప్యాకేజింగ్ ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తున్నారు. దీంతో హీరో రెమ్యునరేషన్‌లో కోత పెట్టేందుకు రెడీ అవుతున్నారట నిర్మాతలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -