నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన చిత్రం హిట్ 3. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు నాని. మీ వయసుకు మించి ఉన్న వ్యక్తి పాత్ర ఎందుకు చేయాలని అనిపించింది?” నిజానికి నానికి ఇప్పటికి 41 సంవత్సరాలు కాగా, ఆ సినిమాలో ఆయన సుమారు 45 ఏళ్ల వ్యక్తి పాత్ర పోషించారు.
దీనికి నాని సరదాగా సమాధానం ఇచ్చారు. తనకు 60 ఏళ్లు కావాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నాను అని చెప్పారు. చిన్న వయసు పాత్రలే చేస్తూ ఉంటే, దర్శకులు అదే రకమైన పాత్రలే రిపీట్ చేస్తూ ఉంటారు. ఆ టెంప్లేట్‌ను బద్దలు కొట్టాలంటే కొత్తదనాన్ని ప్రయత్నించాలి అన్నారు. హిట్ 3 లో 45 ఏళ్ల వ్యక్తిగా నటించడం నాకు కొత్త అనుభూతి. అలాంటి వయస్సులో ఆసక్తికరమైన పాత్రలు ఎక్కువ వస్తాయని నాకు నమ్మకం ఉంది అన్నారు.
తెలుగు సినిమాల్లో ఇప్పటికీ సీనియర్ హీరోలను సాంప్రదాయ కమర్షియల్ పాత్రల్లోనే ఊహిస్తాం కానీ నాని అలాంటి ఆలోచన చేయరు. కథలో వైవిధ్యం ఉంటే చాలు ఒప్పేసుకుంటారు.