కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో జరిగిన అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ కు సిద్దమైంది రేవంత్ రెడ్డి సర్కార్. కేరళ ప్రభుత్వ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
గ్రేటర్ హైదరాబాద్ లో 15 వేల ఎకరాల ప్రభుత్వ భూములు మాయమైనట్లు గుర్తించింది సర్కార్. భూముల విలువ రూ. లక్ష కోట్లకుపైగా ఉంటుందని అంచనా.
అటవీ, దేవాదాయ, వక్ఫ్ భూముల రికార్డుల్లో గందరగోళం ఉన్నట్లు గుర్తించారు.
2014 నుంచి 2023 మధ్య భూలావాదేవిలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని నిర్ణయం తీసుకున్నారు. రికార్డుల తారుమారుతో లక్షల ఎకరాల సమాచారం మిస్సింగ్ అయిందని…ఇందులో అటవీ శాఖ రికార్డుల ప్రకారం 22.74 లక్షల ఎకరాల సమాచారం మాయం అయినట్లు గుర్తించారు. తారుమారైన భూముల వివరాలు సేకరించి
ధరణిపై ఆడిట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేలా రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది.