ఏపీ డీఎస్సీ..చివరి అవకాశం!

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు కీలక హెచ్చరిక. AP మెగా DSC 2024 రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నేడే. ఇవాళ రాత్రి 11:59 గంటల వరకు మాత్రమే అవకాశం ఉండగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.

ఇప్పటివరకు దరఖాస్తు చేయని అభ్యర్థులు తక్షణమే దరఖాస్తు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. గడువు సమీపిస్తున్నండటంతో చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తె అవకాశం ఉండటంతో అర్హత కోల్పోయే ప్రమాదం నివారించేందుకు వెంటనే అప్లై చేయాలని సూచిస్తున్నారు.

మెగా DSC నోటిఫికేషన్ ఏప్రిల్ 20న విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు.

జిల్లా మరియు జోన్ వారీగా ఖాళీల వివరాలు

16,347 పోస్టులలో 14,088 జిల్లా స్థాయి పోస్టులు, 2,259 రాష్ట్ర మరియు జోన్ స్థాయి పోస్టులు ఉన్నాయి.

పోస్టుల వారీగా:

SGT (సెకండరీ గ్రేడ్ టీచర్లు) – 6,599 పోస్టులు

స్కూల్ అసిస్టెంట్లు – 7,487 పోస్టులు

రాష్ట్ర స్థాయి పోస్టులు – 259

జోన్ వారీగా పంపిణీ:

జోన్ 1 – 400 పోస్టులు

జోన్ 2 – 348 పోస్టులు

జోన్ 3 – 570 పోస్టులు

జోన్ 4 – 682 పోస్టులు

ఆన్‌లైన్ రాత పరీక్షలు జూన్ 6 నుండి జూలై 6 వరకు నిర్వహించబడతాయి. హాల్ టికెట్లు మే 30నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రిలిమినరీ కీ ప్రతి పరీక్ష తర్వాత రెండు రోజుల్లో విడుదలయ్యాయి. అభ్యంతరాల స్వీకరణకు 7 రోజులు గడువు ఇవ్వగా అన్ని అభ్యంతరాలు పరిష్కరించిన తర్వాత ఫైనల్ కీ విడుదల చేయనున్నారు. ఫైనల్ కీ విడుదలైన 7 రోజుల్లో మెరిట్ లిస్ట్ ప్రకటించనున్నారు. కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలి అని అధికారులు తెలిపారు.