కాంగ్రెస్కు పట్టిన గతే కూటమిపార్టీలకు పడుతుంది అన్నారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన మహేష్.. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పనిచేసిన ఐఎఎస్ అధికారి ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డిలకు సంబంధం లేని లిక్కర్ స్కామ్లో దోషులుగా చూపి, వారిని అరెస్ట్ చేశారు అన్నారు.
పోలీసులే పచ్చచొక్కాలు వేసుకున్న కార్యకర్తల మాదిరిగా సీఎంఓ నుంచి చెప్పినట్లుగా ఎవరిని పడితే వారిని తప్పుడు కేసులతో అరెస్ట్లు చేస్తున్నారు. కనీస ఆధారాలు ఉన్నాయా అని న్యాయస్థానాలు అడిగితే పోలీసులు నీళ్ళు నములుతున్నారు. లిక్కర్ స్కామ్ పేరుతో చేస్తున్న హంగామా చూస్తూ ఏకంగా వైయస్ జగన్ గారినే అరెస్ట్ చేస్తారనే విధంగా ఒక తప్పుడు ప్రచారంకు తెగబడ్డారు అన్నారు.
గతంలో వైయస్ జగన్ కాంగ్రెస్ను వ్యతిరేకించి పార్టీ పెట్టుకుంటే ఆయనపై తప్పుడు కేసులు పెట్టి, పదహారు నెలలు జైలుకు పంపారు. దానికి ఫలితంగా అదే కాంగ్రెస్ పార్టీ ఏపీలో కనుమరుగు అయ్యింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఇదే విధంగా వ్యవహరిస్తోంది. కూటమి పార్టీలకు కూడా రేపు కాంగ్రెస్కు పట్టిన గతే పడుతుంది.
వైసీపీకి ప్రజల్లో ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. దీనిని చూసి తట్టుకోలేకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేసే ఈ బెదిరింపులకు భయడేదే లేదు. సోషల్ మీడియా యాక్టివీస్ట్లపై ఎంత దారుణంగా ఒకటి కంటే ఎక్కువ తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా యాక్టివీస్ట్లు నేటికీ ఎటువంటి పోస్ట్లు పెడుతున్నారో తెలియదా? వారిమీద ఒక్క కేసు అయినా నమోదు చేస్తున్నారా? రేపు వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడితే వారిని ఉపేక్షిస్తారా? కూటమి ప్రభుత్వం చూపుతున్న బాటలోనే రాబోయే వైయస్ఆర్సీపీ కూడా పనిచేయదని అనుకుంటున్నారా అని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రశ్నించారు.