ఏపీలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని మరోసారి నిరూపితమైంది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో కూటమి నేతల మద్యం మోసం బట్టబయలు అయింది. 24×7 మద్యం విక్రయాలు – చట్టాలకు విరుద్ధం కానీ ఇవేమీ పట్టించుకోకుండా మద్యం అమ్మకాలు చేస్తున్నారు.
తెల్లవారుజామున భూమన అభినయ్ … తిరుపతిలో 10-15 మద్యం దుకాణాలను తనిఖీ చేయగా, ఒక్కో బాటిల్‌పై ₹50 అదనంగా వసూలు చేస్తూ, పగలు -రాత్రి తేడా లేకుండా చట్టవిరుద్ధంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు తేలింది. ప్రజల ముందు లైవ్ వీడియోలో ఈ అక్రమాలు బట్టబయలు చేశారు.
ఈ వీడియోలో ఉన్న షాపులు మరియు తెరిచిన సమయాలు పరిశీలిస్తే…
1.నైన్ స్టార్ వైన్స్, తిరుపతి రైల్వే స్టేషన్ పక్కన – ఉదయం 6:00 AM
2.హరి వైన్స్, ఎస్ టి వి నగర్ – ఉదయం 5:27 AM
3.రాజీవ్ గాంధీ కాలనీ జీవకోన – ఉదయం 6:13 AM
4.సత్యనారాయణపురం రోడ్డు జీవకోన – ఉదయం 5:49 AM
5.ఎస్ వి బార్, గ్రూప్ థియేటర్స్ కి ఎదురుగా బస్టాండ్ పక్కన – ఉదయం 5:59 AM
6.జయ్ శ్యామ్ థియేటర్ పక్కన – ఉదయం 6:08 AM
7.విక్టరీ వైన్స్, వైకుంఠపురం ఆర్చ్ దగ్గర – ఉదయం 6:09 AM
8.కేకే వైన్స్, అకారం పల్లి రోడ్డు – ఉదయం 5:37 AM
9.విక్టరీ వైన్స్, ఎంఆర్ పల్లి రోడ్డు – ఉదయం 5:14 AM
10.విక్టరీ వైన్స్, దేవేంద్ర థియేటర్ దగ్గర – ఉదయం 6:00 AM
11.బడి బార్, లీలామహల్ సర్కిల్ – రాత్రి 12:10 AM
12.హారిక బార్, అలిపిరి రోడ్డు – రాత్రి 12:10 AM
13.బడి వైన్స్, డి బి ఆర్ రోడ్డు – రాత్రి 1:00 AM ఉన్నాయని వీడియోలతో సహా రుజువైంది.
గత ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులకు సంబంధం లేకుండా ప్రభుత్వమే మద్యం విక్రయాలు చేసింది. పార్టీ నాయకుడికీ దీనితో సంబంధం లేకుండా మద్యం పాలసీని అమలు చేశారు. ఇప్పుడు కూటమి పార్టీలకు సంబంధం లేకుండా మద్యం దుకాణాలు నడుస్తున్నాయా? ప్రధానంగా తెలుగుదేశం పార్టీలకు చెందిన నాయకుల చేతుల్లోనే మద్యం దుకాణాలు, విక్రయాలు జరుగుతున్నాయి.