కరోనా లాక్డౌన్ సమయంలో థియేటర్లు బంద్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ కానున్నాయి. ఈ మేరకు ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయానికి వచ్చారు.
నిర్మాతలు దిల్ రాజు, సురేశ్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. అద్దె ప్రాతిపాదికన సినిమాలను ప్రదర్శించలేమని …పర్సంటెజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్ల తీర్మానం చేశారు.
థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకోవడంతో పలు సినిమాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. మే 30న భైరవం, జూన్ 5 ధగ్ లైఫ్, జూన్ 12న హరిహర వీరమల్లు, జూన్ 27న కన్నప్ప, జూన్ 20న కుబేర్, జులైలో కింగ్ డమ్ విడుదల కావాల్సి ఉంది. దీంతో నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.