హేరా ఫేరీ 3..కాంట్రవర్సీపై అక్షయ్!

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, తన రాబోయే చిత్రం ‘హౌస్‌ఫుల్ 5’ విడుదలకు సిద్దమవుతుండగా, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హేరా ఫేరీ 3’ నుండి నటుడు పారేశ్ రావల్ తప్పుకోవడంపై ఏర్పడిన వివాదంపై స్పందించారు. ‘హౌస్‌ఫుల్ 5’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పారేశ్ రావల్ ‘హేరా ఫేరీ 3’ నుండి నిష్క్రమించిన తర్వాత అక్షయ్ ఆయనపై రూ. 25 కోట్ల దావా వేశారన్న వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

దీనిపై స్పందించిన అక్షయ్… నా సహనటుడిపై ‘ఫూలిష్’ (మూర్ఖుడు) అనే పదాన్ని వినడం నన్నెంతో బాధించింది. అలాంటి మాటలు ఉపయోగించకండి. నేను ఆయనతో 32 ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నాను. మేమిద్దరం మంచి మిత్రులం. ఆయన గొప్ప నటుడు. నేను ఆయనను ఎంతో గౌరవిస్తాను అన్నారు.

ఇది ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న విషయం. ఈ విషయం గురించి ఇక్కడ మాట్లాడటం సముచితం కాదు అన్నారు. పారేశ్ రావల్ మాత్రం తన నిర్ణయం దర్శకుడు ప్రియదర్శన్‌తో భేధాభిప్రాయాల వలన కాదు అని స్పష్టం చేశారు.