ప్రభాస్- డైరెక్టర్ మారుతీ కాంబోలో తెరకెక్కుతున్న రాజాసాబ్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఎక్స్ లో పోస్టర్ రిలీజ్ చేశారు.
అలాగే టీజర్ రిలీజ్కు సంబంధించిన అప్డేట్ సైతం ఇచ్చేశారు. ఈ నెల 16న ఉదయం 10.52 నిముషాలకు టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రభాస్ సరసన మాళవిక హీరోయిన్గా నటిస్తోండగా ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హర్రర్ జానర్ లో చేస్తున్నారు. ప్రస్తుతానికి డబ్బింగ్ పనులు జరుగుతుండగా త్వరలోనే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెడుతున్నారంట.