వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు హీరో రామ్ చరణ్. ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది అనే చిత్రంలో నటిస్తోండగా ఇది చరణ్ కెరీర్లో 16వ సినిమా. ఇక ఈ సినిమా తర్వాత మరోసారి సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు చెర్రీ.
గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం ఇండస్ట్రీ ఆల్‌టైం హిట్ సినిమాల్లో చోటు దక్కించుకుంది. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం సినిమా కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది.
ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు – RC17 ఫిక్స్ అయిందని, దానికి సుకుమార్ దర్శకత్వం వహించబోతున్నారని స్పష్టత వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న పెద్ది..రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్‌కి అభిమానులే కాదు విమర్శకుల నుంచీ కూడా మంచి స్పందన వచ్చింది.
