- Advertisement -

వైఎస్‌కు జగన్‌ ఘన నివాళి..

- Advertisement -

డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, ప్రార్థనల్లో పాల్గొన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ షర్మిల, విజయమ్మ, భారతి.

అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్ జగన్‌తో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంక్షేమ ప్రదాత.. అభివృద్ధి విధాత అని కొనియాడారు.

కోట్లాది మంది ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ ఉన్నారు అన్నారు వైఎస్ షర్మిల. ఆయన అమలు చేసిన అద్భుతమైన పథకాల వల్ల ఎంతో మంది లబ్ది పొందారు… వైఎస్ఆర్ మరణాన్ని జీర్ణించుకోలేక దాదాపు 700 మంది చనిపోయారు అన్నారు. వారి కుటుంబ సభ్యులకు నివాళులర్పిస్తున్నా అన్నారు షర్మిల.

అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటి సీఎంలు నారాయణ స్వామి, అంజాద్ బాషా , మాజీ మంత్రి ఉష శ్రీ చరణ్, ఎమ్మెల్యే ఆకెపాటి అమర్ నాథ్ రెడ్డి, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర నాథ్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, రఘు రామ్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు తదితరులు వైయ‌స్ఆర్‌కు నివాళులర్పించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -