తన రాబోయే చిత్రం డక్ష: ఎ డెడ్‌లీ కాన్స్పిరసీ (సెప్టెంబర్ 19న విడుదల) ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు నటి మంచు లక్ష్మి. ఈ సందర్భంగా ఓ జర్నలిస్టు వేసిన ప్రశ్నకు కౌంటర్ ఇచ్చి వార్తల్లో నిలిచారు. మంచు లక్ష్మీ డ్రెస్సింగ్ స్టైల్‌పై ఓ జర్నలిస్టు ప్రశ్నించగా …దానికి ఘాటైన సమాధానం ఇచ్చారు మంచు లక్ష్మీ.
అదే ప్రశ్నను మహేశ్ బాబుకి అడుగుతావా? ‘మీకు 50 ఏళ్లు వచ్చేశాయి, ఎందుకు షర్ట్ లేకుండా కనిపిస్తున్నారు? అని అడుగుతావా? అని నిలదీశారు. ఆ జర్నలిస్టు తల ఊపగానే, “అయితే ఒక మహిళను ఎందుకు అలా అడుగుతావు? చెప్పాలన్నారు.
జర్నలిస్టులకు ప్రజాభిప్రాయం తీర్చిదిద్దే బాధ్యత ఉందని గుర్తు చేసిన ఆమె, సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొనే సమస్యలపై కూడా గళమెత్తారు. ఒక స్టార్ భార్యకు సినిమాల్లో మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె విడాకులు తీసుకున్న తర్వాత ఆ ఆఫర్లు వెనక్కి వెళ్లిపోయాయి. మాజీ భర్తకు అభ్యంతరం ఉంటుందని భావించారు. ఆమె ఇంకా మంచి పనికోసం ఎదురు చూస్తోంది. కానీ మగవారికి అలాంటి పరిస్థితి రాదు. వారి జీవితం సజావుగానే సాగిపోతుంది. మహిళలు మాత్రం స్వేచ్ఛను తామే సాధించుకోవాలి అని వివరించారు.
