- Advertisement -

పవన్ మార్క్‌..ఓజీ ట్రైలర్!

- Advertisement -

సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఓజీ. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండగా ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ట్రైలర్ వచ్చేసింది.

ట్రైలర్‌లో పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ లుక్, స్టైల్, స్వాగ్ పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. అలాగే తమన్ సంగీతం, బీజీఎం సినిమాకు అదనపు ఎమోషన్ అందిస్తున్నాయి. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెంచేశాడు పవన్‌.

పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా విలన్‌గా ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, శుభలేక సుధాకర్, రావు రమేష్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్, వెంకట్ తదితరులు కనిపించనున్నారు. డీజీ టిల్లు బ్యూటీ నేహా శెట్టి స్పెషల్ సాంగ్‌లో సందడి చేయనుండగా నిర్మాతగా డీవీవీ దానయ్య, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సినిమా రూపొందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -