- Advertisement -
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూతురు వివాహం ఘనంగా జరిగింది. అమెరికాలోని ఇల్లినాయిస్‌లో హిందూ సంప్రదాయ పద్ధతిలో రాంబాబు కూతురు శ్రీజ-హర్ష ప్రేమ వివాహం వైభవంగా జరిగింది. హర్షది పశ్చిమగోదావరి జిల్లా తణుకు.
ట్రంప్ ప్రభావంతో అమెరికాలోనే పెళ్లి చేయాల్సి వచ్చిందని అంబటి తెలిపారు. అల్లుడి తల్లిదండ్రులు వీసా సమస్యలతో రాలేకపోయారు. ఏపీకి వచ్చాక ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
డాక్టర్ శ్రీజ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లో ఎండోక్రైనాలజీ విభాగంలో ఫెలోషిప్ చేస్తుండగా జాస్తి హర్ష అమెరికాలో డోయిచ్ బ్యాంక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వరుడి తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రయత్నం చేసినా వీసా రాలేదని.. అందుకే వారు లైవ్‌లో పెళ్లి చూడాల్సి వచ్చిందన్నారు.
