మాస్ మహారాజా రవితేజా నటిస్తున్న 76వ సినిమా టైటిల్‌ను నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా పేరు — “భర్త మహాశయులకు విజ్ఞాప్తి”. రవితేజా గత కొన్ని మాస్ ఎంటర్‌టైనర్లకు భిన్నంగా, ఈసారి కుటుంబ ప్రేక్షకులకు దగ్గరగా అనిపించే సరదా, వినోదాత్మకమైన కథను ఎంచుకున్నాడు.
ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది కిషోర్ తిరుమల. హీరోయిన్లుగా ఆశికా రంగనాథ్ మరియు డింపుల్ హయాతీ నటిస్తున్నారు. మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకునేలా ఉంది . పండుగ వాతావరణాన్ని కలిగించే సన్నివేశాలతో రవితేజా మరోసారి తన టైమింగ్‌ను చూపించాడు.
ఈ సినిమాలో రవితేజా రామ సత్యనారాయణ పాత్రలో కనిపించనున్నాడు. అతను తన జీవితంలోని ఇద్దరు మహిళల (భార్యల/ప్రియురాళ్ల) మధ్య ఇరుక్కుపోతాడు.
ఆ ఇద్దరు మహిళలు రామ సత్యనారాయణకు ఒక ప్రశ్న వేస్తారు. అయితే అతడికి దానికి సమాధానం తెలియదు. అందుకే అతడు గూగుల్, ChatGPT, Gemini AI, అలాగే అనుభవజ్ఞులైన భర్తల సలహా కూడా తీసుకుంటాడు. కానీ ఎవరికీ ఆ ప్రశ్నకు సమాధానం దొరకదు!
ఈ చిత్రాన్ని SLV సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సినిమాలో సునీల్, సత్య, వెన్నెల కిషోర్, సుభలేఖ సుధాకర్, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సంక్రాంతికి రవితేజా బరిలోకి దిగుతున్నాడు.
