- Advertisement -

చిరు కోరిక నెరవేర్చిన రామ్‌చరణ్

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి కోరికను నెరవేర్చారు రామ్ చరణ్. వారసుడిని ఇవాళ ఇటీవల చిరంజీవి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘బ్రహ్మా ఆనందం’ ప్రీ రిలీజ్‌ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన తనకు ఇంట్లో ఉన్నప్పుడు నాకు మనవరాళ్లతో ఉన్నట్లు ఉండదు. ఓ లేడీస్‌ హాస్టల్‌ వార్డెన్‌లా ఉన్నట్లు ఉంటుంది. ఎందుకంటే నా చుట్టూ ఆడపిల్లలే ఉంటారు. అందుకే ఓ అబ్బాయిని కనమని చరణ్‌కు చెప్తుంటాను. మన వారసత్వం కొనసాగాలని అలా అంటుంటా అని సరదాగా మాట్లాడారు.

తాజాగా సీన్ కట్ చేస్తే మెగా ఫ్యామిలీకి గుడ్‌న్యూస్‌తో పాటు చిరు కోరికను నెరవేర్చాడు చరణ్. క రామ్ చరణ్ మరియు ఉపాసన కొణిదెల దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు – ఒక బాబు మరియు ఒక పాప. ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి నేరుగా సోషల్ మీడియాలో వెల్లడించారు.

తల్లి, చిన్నారులు ఇద్దరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. అలాగే, వారి కోసం ప్రేమ, ప్రార్థనలు పంపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు మెగా ఫ్యాన్స్‌తో పాటు చిరు సన్నిహితులు చరణ్ దంపతులకు విషెస్ చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -