అల్లు అర్జున్ – అట్లీ దర్శకత్వంలో AA22 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఈ సినిమాలో పుష్ప ఫేమ్ రష్మిక మందన్న కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో రష్మిక జాయిన్ కాగా ఆమె పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రష్మిక ‛నెగటివ్ షేడ్స్’ ఉన్న పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.
దీంతో బన్నీకి విలన్‌గా రష్మిక కనిపిస్తుందన్న వార్త అభిమానుల్లో జోష్ నింపింది. మోస్ట్ ఆఫ్ షూటింగ్‌నీ ముంబై షెడ్యూల్లో పూర్తిచేస్తున్న ఈ చిత్రంలో, రష్మిక మొదటి సారి తన సోలో సీన్లను పూర్తి చేస్తోంది. ఇది పూర్తయ్యాక ఆమె అర్జున్, జాన్వీ కపూర్ వంటి ఇతర స్టార్స్‌తో కలసి కీలక సన్నివేశాల్లో కూడా నటించనుందని మీడియా వర్గాలు చెబుతున్నారు.
ప్రధాన హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే నటిస్తుందని కూడా సమాచారం. సంగీతం సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
