- Advertisement -

వీడియో..స్కూల్ బ్యాగులో పాము!

- Advertisement -

కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరంలో ఆశ్చర్యానికి గురిచేసే ఘటన వెలుగుచూసింది. ఓ మూడో తరగతి చదువుతున్న బాలిక స్కూల్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, ఆమె బ్యాగులో అనుమానాస్పద కదలిక కనిపించింది. కుటుంబ సభ్యులు బ్యాగును జాగ్రత్తగా పరిశీలించగా, అందులో నాగుపాము ఉండటాన్ని గుర్తించారు. వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ శ్యామ్‌కు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న శ్యామ్ ఘటనాస్థలానికి చేరుకుని, ఎంతో చాకచక్యంగా నాగుపామును బ్యాగు నుంచి బయటికి తీశాడు. పాము విషపూరితమైనదైనా, ఎవరికి ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టినట్లు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

ఈ సందర్భంగా స్నేక్ క్యాచర్ శ్యామ్ ముఖ్య సూచనలు చేశారు. పాములు, ఇతర హానికారక ప్రాణులు దూరే అవకాశం ఉన్నందున విద్యార్థులు తమ స్కూల్ బ్యాగులను ఆట స్థలాలలో లేదా తరగతి గదుల్లో నిర్లక్ష్యంగా తెరిచి ఉంచకూడదని చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ, పచ్చని ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. స్కూల్‌కు వెళ్లే ముందు బ్యాగులను ఒకసారి పరిశీలించడం అలవాటు చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -