- Advertisement -

లైంగిక హింస..మహిళల సమస్యే కాదు!

- Advertisement -

నటి తాప్సీ భారతదేశంలో పెరుగుతున్న అత్యాచారాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ సమస్య ఇంటి నుంచే మొదలవుతుంది అని వ్యాఖ్యానించారు. ఇటీవల ఆరుగేళ్ల బాలికపై పదేళ్ల బాలుడు లైంగిక దాడి చేశాడనే ఘటనను ప్రస్తావిస్తూ, ఇంత చిన్న వయసులో పిల్లలకు ఇలాంటి విషయాలపై అవగాహన ఎలా వస్తోంది అని ప్రశ్నించారు.

10 నుంచి 13 ఏళ్ల మధ్య వయసున్న బాలురు కూడా ఇలాంటి కేసుల్లో నిందితులుగా ఉండటం ఆందోళనకరమని ఆమె పేర్కొన్నారు. ఇది కేవలం చట్టపరమైన శిక్షల సమస్య కాదని, మన పెంపకం విధానంలో ఎక్కడో లోపం జరిగిందేమో ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పిల్లలు ఇంట్లో లేదా ఆన్‌లైన్‌లో ఏమి చూస్తున్నారు? ఏ వాతావరణంలో పెరుగుతున్నారు? అనే విషయాలపై సమాజం అంతర్ముఖంగా ఆలోచించాలని ఆమె సూచించారు.

లైంగిక హింసను “మహిళల సమస్య”గా మాత్రమే చూడకూడదని తాప్సీ స్పష్టం చేశారు. సమ్మతి, గౌరవం, అవగాహన వంటి అంశాలపై పురుషులు కూడా చురుకుగా చర్చల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇది లింగపోరాటం కాదని, సమిష్టి బాధ్యతగా చూడాలని ఆమె అభిప్రాయపడ్డారు.

Assi చిత్రం నేపథ్యంలో కూడా ఈ అంశం ప్రతిబింబిస్తుంది. Anubhav Sinha దర్శకత్వంలో రూపొందిన ఈ కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ ఫిబ్రవరి 20, 2026న విడుదల కానుంది. రోజుకు నమోదవుతున్న 80 లైంగిక దాడి కేసులను సూచిస్తూ ఈ చిత్రానికి “అస్సీ” అనే పేరు పెట్టారు. ఇందులో తాప్సీ ‘రావి’ అనే డిఫెన్స్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -