- Advertisement -

శివరాత్రి స్పెషల్.. ‘ఓం భం భోలే’

- Advertisement -

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్మించే భక్తిరస గీతాలకు ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. గతంలో ‘ఏమి మాయ ప్రేమలోన’ వంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన ‘అకీ క్రియేటివ్ వర్క్స్’ ఈ దఫా భక్తి రస సాంగ్ ను తెరకెక్కించింది. అకీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై రూపొందించిన ‘ఓం భం భోలే’ మ్యూజిక్ ఆల్బమ్ శివ భక్తులతో పాటు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. పరమశివుని భక్తిలో ఓలలాడించేలా రూపొందిన ఈ పాట సోషల్ మీడియాలో మరియు శివ భక్తుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది.

నాగేంద్ర ఇనమడుగు, అనిల్ ఇనమడుగు, అజయ్ ఇనమడుగు, అజయ్ సన్నపు, మరియు అజాస్ జాన్ శివ భక్తులుగా నటించారు. వారి అభినయం, వేషధారణ భక్తి భావాన్ని ఉట్టిపడేలా చేస్తూ ఈ పాటను దృశ్యకావ్యంగా మలచడంలో వీరంతా కీలక పాత్ర పోషించారు. అనిల్ ఇనుమడుగు కేవలం నటించడమే కాకుండా ఈ పాటకు సాహిత్యాన్ని అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహించారు. శివుని గొప్పతనాన్ని వివరిస్తూ ఆయన రాసిన సాహిత్యం వినసొంపుగా ఉండగా, చిత్రీకరణ కూడా అంతే అద్భుతంగా ఉంది. మార్క్ ప్రశాంత్ ఈ పాటకు అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చడమే కాకుండా, తన గాత్రంతో శివతత్వాన్ని మరింత చక్కగా ఆలపించారు. చరణ్ పన్నాల సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నాగేంద్ర ఇనమడుగు నిర్మాతగా వ్యవహరించిన ఓం భం భోలే స్పెషల్ సాంగ్ మహాశివరాత్రి కానుకగా విడుదలైన ఈ పాట ప్రస్తుతం ఆధ్యాత్మిక సంగీత ప్రియుల ప్లేలిస్ట్‌లో చేరిపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -