Friday, June 7, 2024
- Advertisement -

ఓదార్పు యాత్రలోనే జగన్ ప్రాణాలు పోతాయంటున్న టీడీపీ నేత!

- Advertisement -

కర్నూలు జిల్లా తెలుగుదేశం నేత ఒకరు ఒకింత సంచలన వ్యాఖ్యనాలు చేశాడు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించిన ఈ చిత్రమైన మాటను మాట్లాడాడు. జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను ఉద్దేశిస్తూ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అనే తెలుగుదేశం నేత వివాదాస్పదమైన కామెంట్ చేశాడు.

ఈయన మాటల విషయంలో వైకాపా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ ఈ పచ్చచొక్కా నేత ఏమంటాడంటే.. ఓదార్పు యాత్రలోనే జగన్ మోహన్ రెడ్డి ప్రాణాలు పోతాయని అంటున్నాడు. జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర నేపథ్యంలో ఈ తెలుగుదేశం నేత ఈ వ్యాఖ్యానం చేశాడు. జగన్ మోహన్ రెడ్డి యాత్రను ప్రజలు నమ్మబోరు అంటూ విమర్శిస్తూ.. ఇలాంటి ఓదార్పుయాత్రలోనే జగన్ ప్రాణాలుపోతాయేమో అని ఈ తెలుగుదేశం అన్నాడు. ఇలాంటి యాత్రలో ఏమైనాజరగవచ్చని కూడా ఈయన హెచ్చరిక జారీ చేయడం ఇక్కడ గమనించాల్సిన అంశం.

మరి ఇలాంటి వ్యాఖ్యానాలు అయితే మంచివి కాదు. జగన్ మోహన్ రెడ్డి పై తెలుగుదేశం వారు విమర్శలు చేస్తే చేయవచ్చుకానీ.. ఇలా ప్రాణాలు పోతాయి, ఏమైనా జరగవచ్చు.. అనే వ్యాఖ్యానాలు సరికాదు. ఇలాంటి మాటలు ప్రజల్లోకి చెడు సంకేతాలను పంపుతాయి. ప్రతిపక్ష నేత విషయంలో ఇలాంటి వ్యాఖ్యానాలు చేయడం అధికార పక్షానికి తగదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -