హరీష్ శంకర్ -పవన్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్‌సింగ్. తాజాగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కాలర్ ఏయ్ ఎత్తరా సాంగ్‌లో తన ఎనర్జీతో అభిమానులను అలరించారు పవన్. ఈ పాట విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని మైత్రి విమల్ థియేటర్‌లో జరిగింది.
ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. భారీ మాస్ బీట్‌లతో రూపొందిన ఈ పాటలో పవన్ కళ్యాణ్ తన డాన్స్ స్టెప్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ డాన్స్ నంబర్‌లో హీరోయిన్ రాశి ఖన్నా కూడా కనిపించనున్నారు.
ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల ఆలపించారు. మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ పాటలో పవన్ కళ్యాణ్ ఎనర్జీ, డాన్స్ మూవ్స్ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో శ్రీలీల మరియు ఆర్. పార్థిబన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి నేపథ్య సంగీతాన్ని ఎస్. థమన్ అందిస్తున్నారు.
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
