- Advertisement -

దేత్తడి..గ్లింప్స్ అదిరింది!

- Advertisement -

రౌడీ బాయ్స్ ఫేమ్ హీరో ఆశిష్ రెడ్డి ప్రస్తుతం “దేత్తడి” అనే చిత్రంలో నటిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కొత్త దర్శకుడు ఆదిత్య రావు గంగసాని దర్శకత్వం వహిస్తున్నారు.

ఈరోజు చిత్ర బృందం “దేత్తడి” ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్ ఆసక్తికరంగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.ఈ సినిమాలో ఆశిష్ “ఘన్ను భాయ్” అనే పాత్రలో కనిపిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగే పండుగలు, వేడుకల్లో డోలు వాయించే కీలక వ్యక్తిగా ఆయన పాత్రను చూపించారు. తన వృత్తిపై నిబద్ధతతో పాటు ఆగ్రహ స్వభావం కలిగిన వ్యక్తిగా ఆయన పాత్ర రూపుదిద్దుకుంది.

గ్లింప్స్‌లో ఆశిష్ హైదరాబాదీ స్లాంగ్‌లో మాట్లాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన లుక్, నటన సినిమాపై మంచి అంచనాలు పెంచుతున్నాయి. ఈ చిత్రానికి జునైద్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -