మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు దర్శకుడు బుచ్చిబాబు. పెద్ది పహిల్వాన్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో రామ్ చరణ్ తన రిప్డ్ ఫిజిక్‌తో, మాస్ అవతార్‌లో కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే పెద్ది సాంగ్ ఈ వీడియోకి మరింత పవర్ జోడించింది. యాక్షన్, ఇంటెన్సిటీ, ప్రెజెన్స్ అన్ని కలిపి ఈ గ్లింప్స్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచింది.
రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 30న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా గ్లింప్స్‌తో అంచనాలను పెంచేశారు.
ఏఆర్ రెహమానా్ సంగీతాన్ని అందిస్తుండగా వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ మరియు మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
