- Advertisement -

మిస్ థాయ్‌లాండ్..స్టేజ్‌పై పళ్ల సెట్ ఉడిపోయింది!

- Advertisement -

థాయ్‌లాండ్‌లో జరిగిన..మిస్ గ్రాండ్ థాయ్‌లాండ్ 2026 పోటీల్లో ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. ఓ పోటీదారు స్టేజ్‌పై మాట్లాడుతుండగా ఆమె నకిలీ పళ్లు (పళ్ల సెట్ ) అకస్మాత్తుగా ఊడిపోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది.

ఈ ఘటన ప్రిలిమినరీ రౌండ్ సమయంలో చోటుచేసుకుంది. తన పరిచయం చెబుతూ స్టేజ్‌పై ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్న సమయంలో మధ్యలోనే ఆమె పళ్లు ఊడిపోవడంతో అంతా అవాక్కయ్యారు.

అయితే, ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది అసౌకర్యానికి లోనవుతారు. కానీ కమోల్వాన్ మాత్రం అద్భుతమైన ధైర్యం, సమయస్ఫూర్తి చూపించింది. స్టేజ్‌ను వదిలి వెళ్లకుండా, కేవలం ప్రేక్షకులకు వెనక్కి తిరిగి తన పళ్లను సరిచేసుకుని మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగించింది.

ఆమె ధైర్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. వెంటనే ప్రేక్షకులు చప్పట్లతో అభినందించారు. ఆ ఉత్సాహంతో ఆమె మరింత ఆత్మవిశ్వాసంతో ర్యాంప్ వాక్ పూర్తి చేసి, చివరగా చిరునవ్వుతో పోజ్ ఇచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది.

https://www.instagram.com/reels/DWXKzhtDj7W

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -