- Advertisement -

దేవుడిపై నమ్మకం లేదు..కానీ అమ్మ నమ్మకం గౌరవిస్తా!

- Advertisement -

నటుడు ప్రకాష్ రాజ్ తన తల్లి అంత్యక్రియల విషయంలో ట్రోల్స్‌కు ఘాటుగా సమాధానం ఇచ్చారు. తన వ్యక్తిగత నమ్మకాలపై విమర్శలు రావడంతో ఆయన సోషల్ మీడియాలో స్పందించారు.

ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణలత ఈ వారం కన్నుమూశారు. ఆమె క్రైస్తవ మతాన్ని అనుసరించేవారు కావడంతో చర్చిలో సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల వీడియోలు బయటకు రావడంతో కొంతమంది నెటిజన్లు…ప్రకాశ్ రాజ్ గతంలో తాను నాస్తికుడినని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.
క్రైస్తవ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించడంపై విమర్శలు చేశారు.

ఈ విమర్శలకు స్పందించిన ప్రకాశ్‌ రాజ్… నాకు దేవుడిపై నమ్మకం లేదు. కానీ నా తల్లి తన దేవుడిని నమ్మింది. ఆమె నమ్మకాన్ని గౌరవించకుండా ఉండటానికి నేను ఎవరు? అని ప్రశ్నించారు. ఇది పరస్పర గౌరవం అని ద్వేషం వ్యాప్తి చేసే వారు దీనిని అర్థం చేసుకోవాలని అన్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -