గత శుక్రవారం విడుదలైన రెండు తెలుగు చిత్రాలు ‘బైకర్’ మరియు ‘రాకాసా’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ల జోరు చూపిస్తున్నాయి. విభిన్న జానర్లలో వచ్చిన ఈ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి ఓపెనింగ్స్ సాధించాయి.
శర్వానంద్ నటించిన ‘బైకర్’ ఒక ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామాగా ఉండగా సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన ‘రాకాసా’ కామెడీతో పాటు ఫాంటసీ అంశాలను కలగలిపిన చిత్రం.
మొదటి వీకెండ్ ముగిసే సరికి మొత్తం కలెక్షన్లలో ‘బైకర్’ కొద్దిగా ఆధిక్యంలో నిలిచింది. అయితే టికెట్ బుకింగ్స్ విషయంలో ట్రెండ్ మారుతూ వచ్చింది.
వరుసగా మూడు రోజుల పాటు ‘రాకాసా’ బుక్ మై షోలో జోరు కొనసాగించగా తాజాగా బైకర్ రేసులోకి వచ్చింది.
ఓవరాల్‌గా బుక్‌మై షోలో ‘బైకర్’ – టికెట్లు సుమారు 15.5K అమ్ముడవ్వగా ‘రాకాసా’ – టికెట్లు సుమారు 13.7K అమ్ముడయ్యాయి. మొత్తంగా, ‘బైకర్’ vs ‘రాకాసా’ పోరు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది.
