రజనీకాంత్ హీరోగా జైలర్ 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ జైలర్ 2లో కనిపిస్తారని వచ్చిన ప్రచారానికి విరుద్ధంగా, బాలీవుడ్ కింగ్ ఈ ప్రతిష్టాత్మక తమిళ చిత్రంలో భాగం కాబోవడం లేదని ఓ రిపోర్ట్ వెల్లడించింది.
తన రాబోయే చిత్రం కింగ్‌పై పూర్తి దృష్టి పెట్టేందుకు, ఈ క్యామియో ఆఫర్‌ను షారుక్ ఖాన్ వినయంగా తిరస్కరించినట్లు సమాచారం. తన స్క్రీన్ ప్రెజెన్స్‌ను ప్రత్యేకంగా ఉంచుకోవాలని భావించిన షారుఖ్..కింగ్ విడుదలకు ముందు ఇతర సినిమాల్లో కనిపించకూడదని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
మేకర్స్ 5 రోజుల క్యామియో కోసం షారుక్ ఖాన్‌ను సంప్రదించారు. ఆయన ఆ ఆలోచనకు ఓపెన్‌గా ఉన్నారు. కానీ ప్రస్తుతం ఆయన దృష్టి పూర్తిగా కింగ్‌పైనే ఉంది. అలాగే, షారుక్ ఖాన్ స్వయంగా రజనీకాంత్‌తో మాట్లాడి, తన అభిమానాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. భవిష్యత్తులో సరైన సమయంలో క్యామియో గానీ, పూర్తి పాత్ర గానీ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని రాజినీకి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
