హీరో అడివి శేష్ నటించిన తాజా చిత్రం ‘డెకాయిట్’ (Dacoit) విడుదలకు ముందే మంచి హైప్ సొంతం చేసుకుంటోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగా పెరుగుతున్నాయి.
ఏప్రిల్ 10న ప్రీమియర్స్‌కు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండగా, ఈ చిత్రం అమెరికాలో ఇప్పటివరకు 659 షోలు, 339 లొకేషన్లలో 9,044 టికెట్లు విక్రయించి $145,634 వసూళ్లు సాధించింది.
మునుపటి రోజుతో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా షోల సంఖ్య పెరగడం, మరిన్ని లొకేషన్లలో రిలీజ్ ప్లాన్ చేయడం వల్ల ఈ జంప్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇంకా రెండు రోజుల్లో బుకింగ్స్ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉండటంతో, ‘డకాయిట్’ ప్రీమియర్స్‌కు బలమైన ఓపెనింగ్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ లవ్ స్టోరీలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు.
